Thursday 8 March 2012

కలికాలం మరి!


                                                               నిన్న నేను మా ఊరిలో ఉన్న జంట థియేటర్ల ముందుగా వెళుతూ అందులో ప్రదర్శిస్తున్న సినిమాల వాల్ పోస్టర్లు చూసి ఖంగు తిన్నాను. ఒకదాంట్లో శ్రీరామరాజ్యం ఆడుతుండగా మరో దాంట్లో డర్టీ పిక్చర్ ఆడుతోంది. రెండు సినిమాల వాల్ పోస్టర్లు గోడపై పక్క పక్కనే అతికించి ఉండటం చూసి నాకు నిజంగా బాధ కలిగింది. సాంకేతికంగా చూస్తె రెండూ సినిమాలే అయినా, ఎగ్జిబిటర్లు కనీసమైన ఆలోచన కూడా లేకుండా ఆ రెండు సినిమాలు జంట థియేటర్లలో ఏకకాలంలో ప్రదర్శించటం మారుతున్న మన ఆలోచనా విధానానికి ప్రతీక అనుకోవాలా? హిందీ నుండి డబ్ అయిన డర్టీ పిక్చర్ వసూలు చేసిన మొత్తంలో సగమైనా మన తెలుగు సినిమా శ్రీరామరాజ్యం వసూలు చేసిందా? విలువలకు వలువలు ఊడుతున్నాయనుకోవాలా? కలికాలం అనుకోని సర్దుకోవాలా?

Wednesday 22 February 2012

బ్లాగర్లందరికీ శుభాకాంక్షలు.

బ్లాగర్లందరికీ శుభాకాంక్షలు. మరి కొద్ది రోజుల్లో నా టపాలతో మీ ముందుకు రాగలనని మనవి.